16-12-2024 11:12:48 AM
హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ వేశామని నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సంక్రాంతి తర్వాత కొత్త కార్డులు అందజేస్తామని వెల్లడించారు. ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం అందజేస్తామని వివరించారు. కొత్త రేషన్ కార్డులకు రూ, 9.56 కోట్ల వ్యయం అంచనా వేశామని చెప్పారు. కొత్తగా 36 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినేట్ భేటీలో చర్చిస్తామని వెల్లడించారు. రేషన్ కార్డుల జారీలో పాత పద్దతి కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. రేషన్ కార్డుల్లో ఎలక్ట్రానిక్ చిప్ లు ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. రేషన్ కార్డుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని మండలి ఛైర్మన్ తెలిపారు. కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం పోతుందని అనుమానాలు ఉన్నాయని ఛైర్మన్ తెలిపారు. పెద్దఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా వాస్తవం కాదని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ప్రజలు దొడ్డు బియ్యం తినట్లేదు.. సన్నబియ్యం ఇవ్వాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు.