calender_icon.png 4 September, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి గ్రామం నుంచి బీటీ రోడ్లు: మంత్రి సీతక్క

16-12-2024 11:00:01 AM

హైదరాబాద్: మానవ వికాసం, అభివృద్ధికి రహదారులే జీవన రేఖలని పంచాయతీరాజ్, స్త్రీ శిశు శాఖ మంత్రి సీతక్క అన్నారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితులు తమకు తెలుసన్నారు. గ్రామాలకు రోడ్లు వేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని సీతక్క వెల్లడించారు. రూ. 12 వేల కోట్లతో 17 వేల కి.మీ రోడ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి సూచించారు. సీఆర్ఆర్ కింద రూ. 2వేల కోట్లతో 2400 కి.మీ మేర రోడ్లకు టెండర్లు పిలిచామన్నారు. రాబోయే రోజుల్లో 11 వేల కి.మీ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామం నుంచి బీటీ రోడ్లు వేస్తామని చెప్పారు. గత నెల సీసీ రోడ్ల కోసం రూ,324 కోట్లు మంజూరు చేశామన్న సీతక్క ఎంఆర్ఆర్ కింద రూ. 1150 కోట్లు త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు రూ. 50 కోట్లు విడుదల చేశామని తెలపారు.