25-11-2025 07:11:29 PM
కొత్తగూడెంలో చీరలు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు..
తుంగతుర్తి (విజయక్రాంతి): మహిళ సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు దొనకొండ రమేష్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చర్యలను పంపిణీ చేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళాల ఆత్మగౌరాన్ని పెంచుతుందని అన్నారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు. ప్రజా ప్రభుత్వానికి మహిళలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, నాయకులు సిహెచ్ రాములు, గణేష్ ,వీరయ్య, రమేష్, దశరథ, కొమరవెల్లి, సైదులు, ఫీల్డ్ అసిస్టెంట్ అరుణ తదితరులు పాల్గొన్నారు.