calender_icon.png 15 November, 2025 | 12:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటిపారుదల శాఖపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

28-07-2024 03:22:17 PM

హైదరాబాద్: నీటిపారుదల శాఖపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలని సూచించారు., ఈ ఆర్థిక సంవత్సరంలో నీటిపారుదల శాఖ రూ.10,820 కోట్ల పనులపై ఖర్చుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందన్నారు.

ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదు.. ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కావాల్సిందే అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ పనులపై రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్ అధికారులతో సమీక్షించామని, నేటీ నుంచి ఏడాదిలోపు ఆరున్నర లక్షల కొత్త ఆయకట్టు కోసం ఒక ఎక్సర్ సైజ్ మొదలు పెట్టామని ఆయన తెలిపారు. ఇక ప్రతి ఏడాది ఆరు నుంచి ఆరున్నర లక్షల కొత్త ఆయకట్టు కోసం కృషి చేయాలని నిర్ణయించామని, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రతి పని పురోగతి అంశంపై సమీక్ష చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం మాదిరిగా కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టులు కట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.