28-01-2026 12:48:03 AM
ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పలువురు సివిల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డీఎస్పీల బదిలీల్లో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డ్ సిఫార్సుల మేరకు గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను సవరిస్తూ డీజీపీ బి. శివధర్ రెడ్డి సోమవారం రాత్రి కొత్త ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాల్లోని కీలక పోస్టింగుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.సవరించిన పోస్టింగుల వివరాలు ఇలా ఉన్నాయి..
వైరా ఏసీపీగా సారంగపాణి.. గతంలో తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి ఎల్లందు ఎస్డీపీఓగా బదిలీ అయిన ఎస్. సారంగపాణిని, తాజా గా ఖమ్మం జిల్లా వైరా ఏసీపీగా నియమించారు.ఎల్లందు ఎస్డీపీఓగా వెంకన్న బాబు.. ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న యు. వెంకన్న బాబును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లం దు ఎస్డీపీఓగా బదిలీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న ఎన్. చంద్రభాను బదిలీ కావడంతో ఆ స్థానంలో వెంకన్న బాబు బాధ్య తలు స్వీకరించనున్నారు.
నిజామాబాద్ టౌ న్ ఏసీపీగా బి. ప్రకాష్.. సైబరాబాద్ స్పెషల్ బ్రాం చ్ ఏసీపీగా ఉన్న బి. ప్రకాష్‌ను నిజామాబా ద్ టౌన్ ఏసీపీగా బదిలీ చేశారు. ఇప్పటివరకు అక్కడ పనిచేసిన ఎల్.ఆర్. వెంకట్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.జీహెచ్‌ఎంసీలోనే పద్మనా భుల శ్రీనివాస్.. జీహెచ్‌ఎంసీ డీఎస్పీగా ఉన్న పద్మనాభుల శ్రీనివాస్‌ను గతంలో వై రా ఏసీపీగా బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను డీజీపీ రద్దు చేశారు.
ఆయన్ని ప్రస్తు తమున్న జీహెచ్‌ఎంసీ డీఎస్పీ పోస్టులోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.బదిలీ అయిన అధికారులు వెంటనే తమ పాత పోస్టుల నుంచి రిలీవ్ అయి, కొత్త ప్రాంతా ల్లో బాధ్యతలు చేపట్టాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత యూని ట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.