28-01-2026 12:47:08 AM
కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): సంపూర్ణత అభియాన్2.0 కార్యక్రమంలో భాగంగా ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్‌లో చేపట్టాల్సిన అంశాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. తిర్యాణి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం లో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి పాల్గొన్నారు. ఈ సం దర్భంగా విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల ద్వారా చేపట్టే పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సమర్థంగా సన్నద్ధం చేయాలని విద్యార్థినుల కోసం ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు.
నామినేషన్ల స్వీకరణ సమర్థవంతంగా చేపట్టాలి
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్లతో కలిసి రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేస్తున్న కేంద్రాలను జిల్లా ఎస్పీ నితికా పంత్, ఆర్డీఓ లోకేశ్వర్‌రావులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషన ర్ గజానన్, సీఐ బాలాజీ వరప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.