calender_icon.png 12 May, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్భరంగా కుమ్మర వృత్తిదారులు

20-08-2024 12:30:00 AM

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వదేశీ ఉత్పత్తుల అభివృద్ధికి, గ్రామీణ వృత్తుల ఆధునికీకరణకు ఆధునాతన సాంకేతికతను ఆశించిన మేరకు అందించండలో విఫ లమైనాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఉపాధి అవకాశాల కల్పనలో బహుముఖ పాత్ర పోషించే కులవృత్తులైన చేనేత, కుమ్మ రి, వడ్రంగి, మేదరి వంటి ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ తగ్గడం వల్ల గ్రామీణ వృత్తుల పై ఆధారపడిన కార్మికులు వీటిని వదులు కొని పట్టణాలకు వలస వెళ్ల్లి రోజువారీ కూలీలుగా మారుతున్నారు.

చేతివృత్తులు కూడు పెట్టని దశకు చేరుకున్నాయి. నాడు ‘కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్నా’ అన్న నానుడి నేడు చేదుగా మారింది. తెలంగాణలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 14 లక్షల జనాభా ఉన్న కుమ్మర కులవృత్తిదారుల సమస్యలు పరిష్కరిస్తుందనే ఆశతో ఉన్నారు.

మానవాళికి ఆహారం వండుకోవడానికి వంటపాత్రలు సమకూర్చి మానవజాతికి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించి ప్రజారోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రతినిధిగా నిలి చిన  కుమ్మర వృత్తి కార్మికులు ఉపాధి లేక దుర్భర జీవితాలను వెళ్ల్లదీస్తున్నారు. ప్రపంచీకరణ విసిరిన పంజాకు కుమ్మర వృత్తి కు దేలైంది. వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామికీకరణ, కార్పొరేటీకరణ, పట్టణీకరణ, జనా భా పెరుగుదల, ప్లాస్టిక్ వినియోగంపై పెరిగిన క్రేజీ మార్కెట్ ప్రకటనలవల్ల ప్రజల్లో పె రిగిన విదేశీ సంస్కృతివల్ల స్టీల్, ప్లాస్టిక్, అ ల్యూమినియం వస్తువుల వినియోగం బాగా పెరిగింది.

దీంతో కుమ్మర వృత్తి కూడుపెట్టని స్థితికి దిగజారింది. వారు జీవనోపాధి లేక దారిద్య్రరేఖ దిగువన జీవిస్తూ కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితిలో వున్నారు. ప్ర భుత్వాలు కుమ్మరవృత్తి దారుల సంక్షేమానికి, ఆర్థిక ప్రగతికి సమగ్రమైన పథకాలు అ మలు చేయకపోవటం వల్ల వారి బతుకులు ఎండమావిగా మారటం శోచనీయం. ఇతర కు లవృత్తులను ఆదుకుంటున్నట్లే కుమ్మరి వృత్తినీ ఆదుకోవాలి. యువతకు అవగాహన శిక్షణా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించి కుమ్మర యువతలో  శ్రామిక సా మర్థ్యం పెంపొందించే ఉత్పత్తి విధానాలకు, వృత్తి నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వెయ్యాలి. ఈ వృత్తికి మౌలిక సదుపాయాలు కల్పించాలి.

చాకలి, మంగలి వృత్తులకు ఇస్తున్న ఉచి త విద్యుత్తు సౌకర్యం కుమ్మర వృత్తిదారులు ఉపయోగించే విద్యుత్తు సారెకూ ఇవ్వాలి. వీరికి షెడ్స్ నిర్మాణానికి ప్రభుత్వం ఉచితం గా భూమిని స్థలాన్ని కేటాయించాలి. కుమ్మ ర్లు సామాజికంగా, విద్యా ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందడానికి, పోటీని ఎదుర్కోవటానికి కుమ్మర కులాన్ని బిసి ఏ గ్రూపులో చేర్చాలి. విశ్వవిద్యాలయ స్థాయిలో పాటరీ కోర్స్‌ను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ భవిష్యనిధి పథకం, ఆరోగ్య బీమా సౌకర్యం ఈ వృత్తి కార్మికులకు వర్తింప చెయ్యాలి. వీరికి లేబర్ గుర్తింపుకార్డులు, ఆరోగ్య కార్డులు ఉచితంగా అందించాలి.

- నేదునూరి కనకయ్య