08-05-2025 12:00:00 AM
-మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి
గజ్వేల్ మే 7: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అవసరమైన నిధులు సాధిస్తున్నట్లు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం గజ్వేల్ లోని ఢిల్లీ వాలా హోటల్ సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి న సందర్భంగా ఆయన మాట్లాడారు.
గజ్వేల్ ఎమ్మెల్యే కెసిఆర్ పేద ప్రజలను కలవడం కష్టంగా మారిందని, దీంతో అ సంపూర్తి దశలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. త్వరలో నే రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. గత ప్రభు త్వ పాపాలు, నాయకుల స్వార్థం ఫలితంగా ఇండ్లు కేటాయించినప్పటికీ అప్పగించలేదన్నారు.
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో కమిషన్ల కోసమే నిర్మాణాలు చేపట్టగా, ప్రయాణికులకు అందుబాటులో లేకుండా బస్టాండ్ నిర్మాణం చేపట్టి వృధాగా వదిలేసినట్లు తెలిపారు. అంతేకాకుండా గజ్వేల్, ప్ర జ్ఞాపూర్ బస్టాండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. నిర్మాణాల్లో నాసిరకం పనులు చేప ట్టడంతో పదేళ్లు కాకుండానే పగుళ్లు ఏర్పడుతుండగా, చిన్నపాటి వర్షానికి సమీకృత భవనంలో నీరు నిలుస్తున్నట్లు పే ర్కొన్నారు.
గజ్వేల్ ఎమ్మెల్యే కెసిఆర్ సహకరించనప్పటికీ ప్ర భుత్వ అనుమతితో పెండింగ్ లో ఉన్న 800లకు పైగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు గుర్తు చేశా రు. గజ్వేల్ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం ఉంటుందని, అసంపూర్తి దశలో ఉన్న పనుల కోసం నిధుల మంజూరీకి ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తెచ్చినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సుఖేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులు మొనగారి రాజు, రాములు గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి, నర్సింహరెడ్డి, యాదగిరి, నేతలు సమీర్, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, జంగం రమేష్ గౌడ్, ఆజ్గర్, సబ్బ ని నరేష్, అజ్గర్, చెప్పాల శేఖర్, సురేష్, ఎక్బాల్ పాల్గొన్నారు.