calender_icon.png 31 December, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20 లక్షలతో చిన్నారుల పార్క్, ఓపెన్ జిమ్

29-12-2025 12:00:00 AM

ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కుషాయిగూడ, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : కాప్రా డివిజన్ పరిధిలోని వంపు గూడ బ్యాంక్ కాలనీలో రూ.20 లక్షల వ్య యంతో నిర్మించిన చిన్నారుల పార్క్ మరియు ఓపెన్ జిమ్‌ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ ఇలాంటి ప్రజా వ్యాయామ, వినోద సదుపాయాలు పిల్లల శారీరక-మానసిక వికాసానికి ఎంతో ఉపయోగకరమని, యువత మరియు పెద్దలు ఆరోగ్యంగా జీవించేందుకు దోహదపడతాయని తెలిపారు.

నివాస కాలనీల్లోని ఖాళీ ప్రదేశాలను సద్వినియోగం చేస్తూ, ప్రజలకు అవసరమైన సౌకర్యాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. కాలనీ స్థాయిలో ఫిట్నెస్, వినోద మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటం వల్ల ఆరోగ్యకర జీవనశైలి అలవడుతుందని, కుటుంబాలకు అనుకూలమైన సానుకూల వాతావరణం ఏర్పడు తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ఆయన భరో సా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బైరె నవీన్ గౌడ్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు గారు పాల్గొన్నారు.

అలాగే కాలనీ అసోసియేషన్ సభ్యులు లచ్చయ్య, విజయ్ కరణ్, భరత్ వ్యాస్, రామోహం రావు, రామమూర్తి, ప్రేమనాథ్, రాజా రావు, శివరామకృష్ణలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో ఎన్నాళ్లుగానో ఉన్న అవస రాన్ని తీర్చినందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఇంద్రయ్య, గిల్బర్ట్, మహేష్, మల్లారెడ్డి, కొండల్ గౌడ్, ఉష్కమల శ్రీనివాస్, పిల్లి సాయిరాం, కృష్ణ, శివ, గౌస్, గణేష్ తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజ రుకావడంతో కార్యక్రమం ఘనవిజయంగా ముగిసింది. కాలనీలో ఆనందో త్సాహ వాతావరణం నెలకొంది.