29-12-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 28: మాలల చైతన్య సమితి గత పదేళ్లుగా సమాజ హితం కోసం నిర్విరామంగా చేస్తున్న సేవలు అభినందనీయమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే మాలల చైతన్య సమితి 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ నగరంలోని టి.ఎన్.జీఓ భవనంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య, ఉపాధి, రాజకీయాలు, ఆర్థిక సామాజిక రంగాల్లో మాలలు మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ దిశగా తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉచిత విద్య , నాణ్యమైన వైద్యం పేద ప్రజలకు అందించేందుకు అందరం కలిసి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మాల చైతన్య సమితి సభ్యులకు ఎమ్మెల్యే గారు తినిపించారు. ఈ కార్యక్రమంలో మాలె కేశవులు, పత్తి యాదయ్య బి రామకృష్ణ పంబా వెంకటస్వామి , ఎం సుధాకర్, దాసరి శ్రీనివాసులు, ఏం రాములు, గజ్జల చెన్నయ్య, కావలి చెన్నయ్య, తిరుపతయ్య, పెరుమళ్ళ గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు.