calender_icon.png 28 January, 2026 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీలు విద్యలో రాణించాలి

28-01-2026 12:59:37 AM

గొడుగు భీమన్న దేవుడికి ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పూజలు

ఉట్నూర్, జనవరి 27 (విజయక్రాంతి): ఉట్నూర్ మండలంలోని హార్కాపూర్ గ్రామానికి చెందిన  నాయకపోడు గిరిజనులు గొడుగు భీమన్న దేవుడిని పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మంగళవారం భీమన్న దేవుడి ని గంగాపూర్ నుండి నేరడిగొండ మండలం కుంటాల జలపాతానికి వెళ్లి భీమన్ గొడుగు భీమన్నకు స్నానం చేయించి తిరుగు ప్రయాణంలో భీమన్న దేవుడికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక పూజలు చేశారు.

గొడుగు బీమన్న దేవుడితో పాదయాత్రగా వెళ్తుండగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నాయక పోడు గిరిజనుల ప్రత్యేక ఆహ్వానం మేరకు  పూజ లు నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు... ఆచార  వ్యవహారాలను  కాపాడుకుంటూ భావితరాలకు అందిస్తున్నారన్నారు. ఆదివాసీలు విద్యా, వైద్యం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.