28-01-2026 01:08:07 AM
ముగిసిన ఐద్వా 14వ జాతీయ మహాసభలు
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు సంఘీభావం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 27 (విజయక్రాంతి): ‘జీవించే హక్కు కోసం, ఆత్మగౌరవం కోసం భవిష్యత్తులో మహిళా లోకం రాజీలేని పోరాటాలు చేస్తుంది. మనిషి మనుగడకు ప్రాణాధారమైన గాలి, నీరు, అడవులను కూడా కార్పొరేట్లకు కట్టబెడుతున్న పాలకుల తీరును సహించేది లేదు’ అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సం ఘం ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు సుధా సుందర రామన్ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరుగు తున్న ఐద్వా 14వ జాతీయ మహాసభల మూడో రోజున ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం మహిళ లను ఓటు హక్కుకు దూరం చేస్తోందని సుధా సుందర రామన్ ధ్వజమెత్తారు.
బీహార్‌లో ఎన్నికలకు ముందు 65 లక్షల మంది ఓట్లను తొలగిస్తే, అందులో 45 లక్షల మంది మహిళలే ఉండటం దారుణమన్నా రు. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలంటూ చనిపోయిన తండ్రుల బర్త్ సర్టిఫికెట్లు అడగడం మహిళలను వేధించడమే అని మండి పడ్డారు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ల కోసం అడవులను నరికేయడం వల్లే వాతావరణ మార్పులు సంభవించి మహిళలు ప్రకతి విపత్తుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక లేబర్ కోడ్‌లకు నిరసనగా ఫిబ్రవరి 12న కార్మిక సం ఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో ఐద్వా పాల్గొంటుందని ఐద్వా జాతీయ కోశాధి కారి ఎస్ పుణ్యవతి ప్రకటించారు.
మహిళలకు సంబంధించిన కీలక డిమాండ్లను ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వం ముందుంచారు. అభయహస్తం.. ఈ పథకం కింద మహిళలు పొదుపు చేసిన రూ.600 కోట్లను వడ్డీతో సహా వెంటనే తిరిగి చెల్లించాలి. నరే గా.. 85 శాతం మహిళలకు ఉపాధినిచ్చే ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చే యొద్దు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, నాణ్యమైన వైద్యం అందించాలి. దేశం లో 57.6 శాతం మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతుండటం ప్రభుత్వాల వైఫ ల్యానికి నిదర్శనమని ఆమె విమర్శించారు.
ఏడు ప్రచురణల విడుదల
ఈ సందర్భంగా ఐద్వా నేతలు ఏడు రకా ల పుస్తకాలను ఆవిష్కరించారు. ఎంఎఫ్‌ఐ దోపిడీపై దేశవ్యాప్త సర్వే నివేదిక, కేరళలో మహిళా సాధికారత, కుటుంబశ్రీ కథనం, తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర తదితర అంశాలపై ప్రచురించిన ఈ పుస్తకాలు మహిళా హక్కుల ఉద్యమానికి దిక్సూచిగా నిలుస్తాయని నేతలు పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు.