17-05-2025 12:53:57 AM
నిజాంసాగర్ మే 16( విజయ క్రాంతి): పిట్లం, నిజాంసాగర్, మహమ్మద్ నగర్, మండలాలకు చెందిన లబ్ధిదారులకు పిట్లం మండ ల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో శుక్రవారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
నిరుపేదలకు కల్యాణ లక్ష్మి ఒక వరం లాంటిదని, ఎన్ని ఆర్తికి అడ్డంకులు ఉన్న నిరుపేదలకు తక్షణ సాయం చేయాలని ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నాయకులు రామ్ రెడ్డి, మల్లికార్జున్, సంకు లక్ష్మయ్య, ప్రజాపండరి, తదితరులు పాల్గొన్నారు.