17-05-2025 12:53:20 AM
జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్
మహబూబాబాద్, మే16 (విజయ క్రాంతి): ప్రజా ఆరోగ్యానికి డెంగ్యూ వ్యాధి సమస్యగా మారిందని మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ అన్నారు. జాతీయ డెంగ్యూ వ్యాధి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుండి నెహ్రూ సెంటర్ వరకు చేపట్టిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ బి.రవి రాథోడ్ , జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు కలిసికట్టుగా కృషిచేస్తేనే నియంత్రించడం సాధ్యమవుతుందన్నారు. మానవ ప్రేరేపిత వ్యాధి అని, దోమల వృద్ధికి అనుకూలమైన పరిస్థితులను మనుషులే సృష్టిస్తున్నారని అందువల్ల డెంగ్యూ పీడ వదిలిపోవాలంటే దోమల నియంత్రణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు.
దోమలు వృద్ధి చెందకూడదంటే ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు వంటివి ఇంటి చుట్టుపక్కల ఉండకూడదని, ఇంట్లో దోమలు కుట్టకుండా పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇలాంటి జాగ్రత్తలపై క్షేత్ర స్తాయిలో పనిచేసే వైద్య సిబ్బంది వాడవాడలా విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ర్యాలీలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ శ్రావణ్, ఆర్‌ఎంఓ లు డాక్టర్ జగదీశ్వర్ , హర్షవర్దన్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఇన్ చార్జ్ డిపిహెచ్‌ఎన్‌ఓ సక్కుబాయి,
ఆరోగ్య విద్యా బోధకులు కె.వి. రాజు, పురుషోత్తo , సబ్ యూనిట్ ఆఫీసర్ గోపిచంద్, శ్రీరామ్. ఎంపిహెచ్‌ఈఓ వొబిలిశెట్టి రామకృష్ణ, కేఎల్‌ఎన్ స్వామి, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఈ కృష్ణ, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, టీ హబ్, పాలియేటివ్ కేర్, డిఐసి మేనేజర్ విజ్ఞేశ్వర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.