25-10-2025 12:00:00 AM
అలంపూర్ అక్టోబర్ 24:రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సీసీఐ కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు అన్నా రు. శుక్రవారం మండల పరిధిలోని ఉండవల్లి స్టేజి సమీపంలో ఉన్న వరసిద్ధి వినా యక కాటన్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీను,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని పుష్పమ్మ, సెక్రటరీ ఎల్ల స్వామి, నాయకులు గజేందర్ రెడ్డి, రఘు రెడ్డి ,రుక్మానందరెడ్డి మస్తాన్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.