calender_icon.png 26 October, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

25-10-2025 12:00:00 AM

గండీడ్, అక్టోబర్ 24: పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించి వారి అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం జంగం రెడ్డిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం, రెడ్డిపల్లి గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనం నిర్మాణం కోసం భూమి పూజ, వెన్నచేడ్ మోడల్ స్కూల్లో ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వారి సొంతింటి కలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు. సన్న బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు,రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలతో పేదలు లబ్ధి పొందుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పీ.సీ.సీ. సభ్యులు నరసింహారావు,గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి, పి.ఎ.సి.ఎస్. చైర్మన్ లక్ష్మీనారాయణ,హౌసింగ్ డి. ఈ. పుష్పలత, సూపరిండెంట్ హరిచంద్ర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి,ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆశన్న, బి.సి. సెల్ అధ్యక్షులు శంకరయ్య,వెంకన్న గౌడ్, పులిందర్ రెడ్డి, కొండారెడ్డి, పంచాయతీ కార్యదర్శి హైమావతి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోస్గి మొగులయ్య,వెంకటేష్, నర్సింలు, శ్రీనివాస్,తిరుపతిరెడ్డి, హనుమంతు,పాలమూరు ఆంజనేయులు,కృష్ణయ్య, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.