25-10-2025 12:00:00 AM
* మున్సిపల్ కమిషనర్ కిషన్
* పారిశ్రామికవేత్తలతో సమావేశం
జిన్నారం, అక్టోబర్ 24 : ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి బొల్లారం మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కిషన్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని సాయిబాబా మందిరం ఫంక్షన్ హాల్లో పారిశ్రామికవేత్తతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్ను చెల్లింపులతో పాటు ట్రేడ్ లైసెన్స్, సీఎస్‌ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి పనులు, ఐఈసీ ఆక్టివిటీస్ కు పారిశ్రామిక వేత్తల సహకారం, టీయూఎఫ్‌ఐడీసీ నిధుల ద్వారా పారిశ్రామిక వాడ అభివృద్ధి, పారిశుద్య పనులు, వీధి దీపాల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం కమిషనర్ కిషన్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు వెంటనే ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బకాయిలు లేకుండా ఆస్తి పన్నులు చెల్లించాలన్నారు. ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంద్ రావు మాట్లాడుతూ మున్సిపల్ సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామన్నారు.
ట్రేడ్ లైసెన్స్‌లు తీసుకొని ఆస్తి పన్నులు చెల్లిస్తామన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాయుడు, మేనేజర్ మల్లికార్జున స్వామి, ఆర్‌వో నర్సింలు, పరిశ్రమల ప్రతినిధులు, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొన్నారు.