27-09-2025 05:55:08 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): పోచారం మున్సిపల్ చౌదరిగూడలోని నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల(Nalla Narasimha Reddy Engineering College)లో శనివారం బతుకమ్మ పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలో పూవులను పూజించే సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నదని కళాశాల డైరెక్టర్ డాక్టర్ సి.వి. కృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల వైస్ ఛైర్మన్ నల్ల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. యువతకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల మక్కువ పెంచేందుకు ఈ వేడుక ఉపయుక్తము అవుతుందని కళాశాల డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యమంలో విద్యార్థులు, ఉపాధ్యాయురాళ్లు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.