calender_icon.png 14 August, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే

14-08-2025 06:55:51 PM

పరకాల/హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): గురువారం ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో ఎస్ డి ఎఫ్ నిధుల నుండి 20 లక్షల రూపాయలతో చేపట్టిన మహిళా కమ్యూనిటీ హాల్ ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి(MLA Revuri Prakash Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. గతంలో మహిళలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారని, నేడు విభిన్న రంగాల్లో రాణిస్తూ ప్రథమ స్థానంలో నిలుస్తున్నారన్నారు. పరకాల నియోజకవర్గంలోని మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మహిళా డైరీ లను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. 32 కోట్ల రూపాయలతో మహిళా భాగస్వామ్యంతో మహిళా డైరీ ఏర్పాటు చేయబోతున్నామని, మహిళలు తన సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సాహాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు అందిస్తున్న వడ్డీలేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ గా మార్చారని, అలాగే డిజిటల్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, గ్రామానికి హెల్త్ సెంటర్ మంజూరైనదని, రూ 50 లక్షల రూపాయలతో సీతారామస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, నివాస గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్ ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సు కొనుగోలు తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.