calender_icon.png 14 August, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయంలో నానో టెక్నాలజీ సాంప్రదాయ ఎరువుల స్థానాన్ని భర్తీ చేస్తుంది..

14-08-2025 07:31:00 PM

మండల వ్యవసాయ అధికారిని పద్మజ..

మునుగోడు (విజయక్రాంతి): వ్యవసాయ రంగంలో న్యానో టెక్నాలజీ సంప్రదాయ ఎరువుల స్థానాన్ని భర్తీ చేస్తూ నేరుగా పిచికారి చేయడం వలన మెరుగైన నేల ఆరోగ్యం, పోషకాల వినియోగ పెరుగుతుందని మండల వ్యవసాయ అధికారిని పద్మజ(Mandal Agriculture Officer Padmaja) అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో యూరియ సరఫరా తనిఖీ చేసి మాట్లాడారు. అక్కడ ఉన్న రైతులకు నానో యూరియపై అవగాహన కల్పించారు. నానో టెక్నాలజీ అనేది సైన్స్, ఇంజనీరింగ్ ని కలబోసిన అధ్యయనం, మానవ నిర్మిత నానోపార్టికల్స్ అనేవి ఇంజనీరింగ్ నానోపార్టికల్ నిర్దిష్ట అనువర్తనాల కోసం రూపొందించబడ్డాయిని తెలిపారు.

పరిమాణము మారదు కాని ఉపరితల వైశాల్యం పెరుగుతుందని, ఎక్కువ ఉపరితల వైశాల్యం అంటే ఆకు ఉపరితలంపై ఎక్కువ చర్య, దీనివలన ఎక్కువ పీల్చుకోవడం(శోషణ) జరుగుతుందని అన్నారు. (నానో టెక్నాలజీ అంటే సాంప్రదాయ ఎరువులను, కొత్త టెక్నాలజీ తో కలిపి వాడడం) దీనివలన మెరుగైన పంట ఉత్పాదకత కలుగుతుంది. నానో యూరియాను రెండు సార్లు పై పాటుగా ఒక ఎకరానికి అర లీటరు పిచికారి చేయాలన్నారు. సాంప్రదాయ యూరియతో పోలిక చూసిన నానో యూరియా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుందని తెలిపారు.