14-08-2025 07:21:18 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆదేశాల మేరకు ల్యాండ్ రికార్డ్ సర్వేలో లైసెన్స్ సర్వేయర్ల ఎంపిక రెండో దశ ఈనెల 18 నుంచి చేపట్టనున్నట్టు జిల్లా అధికారి సుదర్శన్ రాథోడ్(District Officer Sudarshan Rathod) తెలిపారు. జిల్లాలో రెండో విడత కింద 100 మందిని ఎంపిక చేయడం జరిగిందని ధ్రువ పత్రాలను ఈనెల 18న పరిశీలించి మెరిట్ ఆధారంగా లైసెన్స్ సర్వేలను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఎంపికైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఉదయం 10:30 కు ల్యాండ్ రికార్డ్ సర్వే కార్యాలయానికి అన్ని ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.