14-08-2025 07:50:08 PM
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): నగరంలోని స్థానిక కట్టరాంపూర్ లో గల కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాల(Kakatiya Smart Kids School)లో గురువారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి(Krishna Janmashtami) వేడుకలు ఎంతో కోలాహలంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి వేడుకలను పాఠశాల కరస్పాండెంట్ దంపతులు శ్రీ గున్నాల క్రాంతి కుమార్ - అర్చన, కృష్ణ భగవానుడు చిత్రపటమునకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి వేడుకలకు కిండర్ గార్డెన్ విద్యార్థులు కృష్ణ భగవానుడు, రాధా, గోపికల వేషధారనలతో విచ్చేసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఉట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత అధ్యాపక బృందం శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించిన వివిధ కథలను పురాణాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. ఆ తర్వాత విద్యార్థులచే ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్, ప్రిన్సిపల్ అర్చన, వైస్ ప్రిన్సిపల్ సందీప్, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.