calender_icon.png 14 August, 2025 | 7:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఆర్ఆర్ జలాశయంలో 16.07 టీఎంసీల నీటి నిల్వ

14-08-2025 06:53:39 PM

బోయినపల్లి (విజయక్రాంతి): బోయినపల్లి మండలం మాన్వాడ శ్రీ రాజ రాజేశ్వర జలాశయం(Sri Raja Rajeshwara Reservoir)లో గురువారం 16.07 టీఏంసీల నీటి నిల్వ ఉన్నట్లు జలాశయం ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ వరద కాలువ ద్వారా 3310 క్యూసెక్కుల నీరు రాగ, మూల వాగు నుంచి ఎఫ్ఎఫ్సీ నుంచి 2400 క్యూసెక్కుల వరద నీరు వచ్చినట్లు వారు తెలిపారు. మొత్తం 5710 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, 110 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్లినట్లు వారు తెలిపారు. జలాశయం సామర్థ్యం 27.54 టీఎంసీల సామర్థ్యాన్ని గాను 16.07 టిఎంసిల నీటి నిల్వ చేరినట్లు వార్తలు తెలిపారు. జలాశయంకు వరదకల ద్వారా ఇన్ఫ్లో కొనసాగుతుంది. జలాశయంలో నీటి నిలువ మరింత పెరగనున్నది.