14-08-2025 07:54:48 PM
అభినందించిన వాహనదారులు..
మంగపేట (విజయక్రాంతి): ఏటూరు నాగారం మంగపేట బూర్గంపాడు వెళ్లే జాతీయ రహదారిలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు సమీపంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్డు ఇరువైపులా పెద్ద గుంతలుగా ఏర్పడి గుంతలతో నీళ్లు నిలవడంతో ప్రయాణికులు వాహనదారులు గుంతలో పడి ప్రమాదాలకు గురై తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటే వారిని చూసి చలించి పోయిన ఒక సాధారణ మహిళ తన చున్నిని మూడు కర్రల సహాయంతో ప్రమాదపు హెచ్చరికగా పెట్టడం జరిగింది. తన ఔన్నత్యన్ని చూసి వాహనదారులు ప్రజలు అభినందించారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.