14-08-2025 07:39:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): పోలీస్ శాఖ అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్న 100 డయల్ ను దుర్వినియోగం చేసిన నిందితుని గురువారం అరెస్ట్ చేసినట్టు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్(CI Praveen Kumar) తెలిపారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన ఎస్ రాజేందర్ వందకు ఫోన్ చేసి పోలీసులను తప్పుదారి పట్టించాలని పేర్కొన్నారు. నిందితుని గుర్తించి దుర్వినియోగం చేసిన అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నందుకు అరెస్టు చేసి రిమాండ్ తరలించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై పోలీసులు ఉన్నారు.