14-08-2025 07:27:03 PM
భాజాపా మండల అధ్యక్షుడు రావుల జానకి రావు..
మంగపేట (విజయక్రాంతి): మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు రావుల జానకి రావు(BJP Mandal President Ravula Janaki Rao) ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం పాల్గొన్నారు. మంగపేట ప్రభుత్వ పాఠశాల నుండి తెలంగాణ సెంటర్ వరకు వందే మాతరం జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకీ జై జైహింద్ స్వాతంత్ర సమరయోధులకి జై వంటి దేశభక్తి నినాదాలతో భారీ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బలరాం మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన దేశసేవ అని పిలుపునిచ్చారు. మొన్న జరిగిన ఉగ్రదాడి సందర్భంలో దేశ బార్డర్లో ఉన్నటువంటి జవానులు చూపిన ధైర్యసాహసాలను ప్రస్తావిస్తూ ప్రతి పౌరుడూ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే ప్రపంచంలో భారతదేశాన్ని నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ జాడి వెంకట్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు లోడే శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు జీనుకుల కృష్ణాకర్ రావు జిల్లా ప్రధాన కార్యదర్శి భర్తపురం నరేష్ మాజీ మండల అధ్యక్షులు యర్రంగారి వీరన్ కుమార్ మండల ప్రధాన కార్యదర్శిలు బొల్లికొండ సాంబయ్య నిడదవోలు శ్రీనివాసు మండల ఉపాధ్యక్షులు రామగాని నరేందర్ బూర సుధాకర్ కార్యదర్శులు మీనుగు తిరుపతి కాసర్ల మల్లారెడ్డి రోహిత్ కుమార్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి కట్టుకోజు ప్రశాంత్ మండల బీజేవైఎం అధ్యక్షులు మూతి రవి బూత్ అధ్యక్షులు యర్రంగారి ప్రకాష్ తోలెం శంకర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.