14-08-2025 07:52:44 PM
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ సిటీలో మూడు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy), మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఎన్ పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేష్ బాబు పరిశీలించారు. నగరంలోని ఆర్ అండ్ బి ఎస్.ఇ కార్యాలయ ప్రాంగణం, జిల్లా పశు వైద్యశాల, మహాత్మా జ్యోతిబాపూలే మైదానం, జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణ, కలెక్టరేట్ ప్రాంగణం, ఆటోనగర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు.
నగరంలో ఇప్పుడు ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లపై ఓవర్ లోడ్ ను తగ్గించేందుకు కొత్తగా మూడు సబ్ స్టేషన్లు నిర్మించనున్నారు. ఇందులో ఒకటి ఇండోర్ సబ్ స్టేషన్ కాగా మరో రెండు ఓపెన్ సబ్ స్టేషన్లు, పరిశీలించిన స్థలాల్లో మూడు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డి.ఈ రాజం, ఈఈ శ్రీనివాస్, ఏడిఈలు అంజయ్య, శ్రీనివాస్ లావణ్య, కరీంనగర్ అర్బన్ తహసిల్దార్ నరేందర్ పాల్గొన్నారు.