14-08-2025 07:15:01 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల(Samsthan Narayanpur Mandal) పరిధిలోని పుట్టపాక గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న పది ఆవులను బిజెపి నాయకుల సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. ఏపీ 39 డబ్లూజి 0751 నంబరు గల వాహనంలో విజయవాడ నుండి ఇబ్రహీంపట్నం తరలిస్తుండగా దాడిచేసి పట్టుకొని కేసు నమోదు చేశారు.