05-08-2025 12:05:44 AM
నాగార్జునసాగర్, ఆగస్టు 4 : నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు జయవీర్ రెడ్డి, ఈ సందర్భంగా ఆర్‌ఎంఓ భాను ప్రసాద్ నాయక్ తో కలిసి వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.
వైద్యులు సిబ్బంది యొక్క హాజరు వివరాలను పరిశీలించారు, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులలో నిర్లక్ష్యం వహించకుండా రోగులకు సకాలంలో చికిత్స అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.