10 May, 2026 | 1:24 AM

బుర్ర మత్తడి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

26-05-2025 01:40 AM

కామారెడ్డి, మే 25 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బుర్ర మత్తడి కాల్వ పూడికతీత పనులను ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులను పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు కామారెడ్డి పెద్ద చెరువు కాలువ పూడికతీత పనులు చేపట్టాలని కాలనీలో దుర్వాసన వస్తుందని అధికారులకు, ఎమ్మెల్యేకు విన్నవించగా పూడికతీత పనులు చేయాలని ఆదేశించారు.

ఆదేశాల మేరకు పనులు జరుగుతున్న తీరును  పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులు చీటీ పాండురంగారావు, సాయి రెడ్డి, రవి, అంజయ్య, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.