10-05-2025 12:41:11 AM
- గజ్వేల్ మాతా శిశు ఆసుపత్రిని పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
- కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని త్వరగా తరలించాలి
సిద్దిపేట/గజ్వేల్/కొండపాక/జగదేవపూర్, మే 9: సహజ ప్రసవాలు సంఖ్యను పెంచుతూ గర్భవతులకు మెరుగైన సేవలు అందించాలని మాత శిశు ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి అదేశించారు.
శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి డాక్టర్ లు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో నెలకు సుమారు 400 వరకు ప్రసవాలు చేయడం అభినందనీయమన్నారు.
ప్రసవాలలో నార్మల్ డెలివరీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, వైద్యులు పేషంట్లతో అన్యోన్యంగా మెలగాలన్నారు. బ్లడ్ బ్యాంక్, పేషెంట్లు కూర్చోవడానికి బెంచీలు, టేబుల్స్, మరుగుదొడ్లు ఇతర ఆన్నిటికీ పరిగణలోకి తీసుకుని మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ వెల్లడించారు.
జగదేవపూర్ మండలం మునిగడప గ్రామ పరిధిలోగల పలుగడ్డ శివారులో గల సుమారు 400 ఎకరాల టీజీఐఐసి ల్యాండ్ ను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ల్యాండ్ మ్యాప్ లో అందించాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు. ల్యాండ్ చుట్టూ రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
కలెక్టర్ వెంట ఆర్డిఓ చంద్రకళ, డిసి హెచ్ ఓ అన్నపూర్ణ, తహసిల్దార్ ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని వారి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి రైస్ మిల్క్ వెంటనే తరలించాలని ఐకెపి సిబ్బందిని ఆదేశించారు శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు చింతమడక గ్రామాలలో కలెక్టర్ పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.
జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ కొండపాక మండలంలోని జప్తి నాచారం వెలికట్ట గ్రామాలలో పర్యటించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు తగు సూచనలు సలహాలు చేసి అధికారులను అప్రమత్తం చేశారు. మండలంలోని రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికలో అర్హులులే ఉండాలని ఆదేశించారు.