25-10-2025 08:10:09 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): కాకతీయ యూనిర్సిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అథ్లెటిక్స్(క్రాస్ కంట్రీ) పోటీలో 10 కిలోమీటర్ల విభాగంలో స్థానిక ప్రియదర్శిని డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బీకాం రెండవ సంవత్సరం చదువుతున్న మాలోత్ అఖిల్ ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. త్వరలో జరగబోయే ఆలిండియా యూనివర్సిటీ పోటీలకు విద్యార్ధి ఎంపికైనట్లు కళాశాల కరస్పాండెంట్, డాక్టర్ కాటేపల్లి నవీన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా అఖిల్ను కళాశాల ఆవరణలో సత్కరించి అభినందించారు.
అనంతరం కళాశాల డైరెక్టర్ శ్రీరామనేని చలపతిరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ నయీం పాషా మాట్లాడుతూ, కాకతీయ యూనివర్సిటీ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి ఆలిండియా యూనివర్శిటీ పోటీలకు, తమ కళాశాల నుండి మాలోత్ అఖిల్ ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాయల వివేక్, పీడీ కాశిమల్ల రమేష్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.