calender_icon.png 29 August, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

క్షతగాత్రులకు ఎమ్మెల్యే జారే అండ

18-09-2024 08:42:29 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని ములకలపల్లి మండలం సీతారాంపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అండగా నిలిచారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విషమ పరిస్థితుల్లో ఉన్న ఆటో డ్రైవర్ టికెట్ ప్రవీణ్ కుమార్, ప్రైవేటు పాఠశాల విద్యార్థిని అటికెట్ అక్షితను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, దగ్గరుండి వైద్య సేవలు అందేలా చూస్తున్నారు.