calender_icon.png 5 September, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల తీరుపై ఎమ్మెల్యే గరం గరం.....

03-09-2025 11:34:00 AM

మాడ్గుల: ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి లబ్ధిదారులకు అధికారులు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వ్యవరించిన తీరు పట్ల ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayana Reddy) అధికారులపై గరం గరం అయ్యారు. మంగళవారం మాడుగుల మండల కేంద్రంలో రైతుగా రైతు వేదికావరణలో మండలానికి ప్రత్యేక కోట కింద మంజూరైన 115  ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు  ప్రొసీడింగ్లను అందజేసేందుకు  కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే  కార్యక్రమానికి పలువురు లబ్ధిదారులు  రాకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. లబ్ధిదారులకు సమాచారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించారని గుర్తించి వారిపై ఆయన మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క  ప్రజా పాలనలో  సూపర్ పాలన అందించాలని ఉద్దేశంతో  అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంలో  కృషి చేస్తుంటే మరోపక్క అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారుల వైఖరి కారణంగానే ప్రభుత్వంకు మచ్చ వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు సమాచారం ఇవ్వకుండా  తమాషాలు చేస్తున్నారా అంటూ... ఎమ్మెల్యే అంటే భయం భక్తి కనీసం విలువ లేకుండా పోయిందని.... మీ జీతం మాకిస్తున్నారా అంటూ వారిని నిలదీశారు. మరోసారి తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వివరించిన అధికారులపై చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో పలువురు పార్టీ నేతలు సైతం అధికారుల తీరుపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్ అందజేత కార్యక్రమం  మరో తేదీ పెట్టుకొని లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ నాయకులు రామ్ రెడ్డి, తాసిల్దారు వినయ్ సాగర్, ఇన్చార్జి ఎంపీడీవో వేజన్న, ఏవో అరుణకుమారి, మాజీ ఎంపీపీ జంగయ్య, నాయకులు కిషన్ రెడ్డి డైరెక్టర్లు జగన్, జంగయ్య,రమేష్, మాజీ సర్పంచ్ కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు