05-09-2025 12:00:53 AM
భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జనం
తాండూరు, 4 ఆగస్టు (విజయక్రాంతి) : గత తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడిని నేడు భక్తులు భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేర్చారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో శ్రీ వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన వినాయక శోభాయాత్ర పురవీధుల గుండా కదిలింది.
దారి పొడుగునా భక్తులు భజన సంకీర్తనలు పడుతూ కోలాటం ఆడుతూ మండల పరిధిలో ఉన్న తిమ్సాన్ పల్లి వాగులో 20 కి పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గ్రామ కార్యదర్శి లాలప్ప శోభ యాత్రను పర్యవేక్షించారు. చిన్నారులు పాడిన కోలాటం శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంకా ఈ వినాయక నిమజ్జనోత్సవం లో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు భారీగా పాల్గొన్నారు