04-09-2025 11:32:27 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ మండల స్థాయి క్రీడల్లో ఏవియం పాఠశాల(AVM School) విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలిబాల్ ఆటలో ప్రథమ, బహుమతి నుండి ఐదు స్థానాల బహుమతులు గురువారం కైవసం చేసుకున్నారు. గెలుపొందిన విద్యార్థులను ఆపాఠశాల చైర్మన్ కందాల పాపిరెడ్డి పాఠశాల ప్రిన్సిపాల్ కందాల స్వప్న శ్రీకాంత్ రెడ్డి, పీడీ నిమ్మల శంకర్ గౌడ్, ఉపేందర్, పూర్ణచందన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.