03-09-2025 11:31:57 AM
పటాన్చెరు,(విజయక్రాంతి): పటాన్చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మున్సిపాలిటీ(Aminpur Municipality) పరిధిలోని ఓడిఎఫ్ ఫేస్ 01 లో ఏర్పాటుచేసిన బాల గణపతి అందరిని ఆకట్టుకుంటుంది. గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకతతో గణేషుడిని ఏర్పాటు చేస్తామని,ఆరు నెలలు ముందుగానే వినాయక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకొని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అన్నారు.
అందులో భాగంగానే ఈ సంవత్సరం బాల గణపతిని ఏర్పాటు చేశామని ప్రతిరోజు సంస్కృతిక కార్యక్రమాలు,భజనలు రోజుకో రకం పూజలు ఏర్పాటు చేస్తామని ఆరవ రోజు శివపార్వతుల కళ్యాణo, 7వ రోజు 56 రకాల మిఠాయిలతో చెప్పన్ భోగ్ అంగరంగ వైభవంగా నిర్వహించామని ఈ కార్యక్రమాలు వీక్షించడానికి కాలనీవాసులే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భారీగా భక్తులు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఎక్కడ లేని విధంగా ప్రతిరోజు ఉదయం,సాయంత్రం నిత్య అన్నదానం ఏర్పాటు చేస్తామని ఎవరు ఎక్కువ తక్కువ అనే భావన లేకుండా అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తామన్నారు. ఆ గణనాథుడు ఆశీస్సులు అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరీ ముఖ్యంగా అమీన్పూర్ నుండి చందానగర్ వెళ్లే ప్రధాన రహదారి వచ్చే సంవత్సరం వినాయక చవితి నాటికి ప్రజలకు అందుబాటులో రావాలని కోరుకుంటున్నామని కాలనీవాసులు కోరారు.