04-09-2025 11:27:54 PM
రామచంద్రాపురం: రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాథుని మండపాలను గురువారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) దర్శించుకున్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. శనివారం నిర్వహించనున్న నిమజ్జనం సందర్భంగా.. అన్ని చెరువుల వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో సీనియర్ నాయకులు నగేష్ యాదవ్, పరమేష్ యాదవ్, ఐలేష్ యాదవ్, రాజు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.