calender_icon.png 5 September, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూనె దీపాలతో గణపతి ఆకృతి

04-09-2025 11:15:32 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని మహమ్మద్ ఖాసీం బస్తీలో ఏర్పాటుచేసిన గణేష్ మండళి వద్ద గురువారం రాత్రి మహిళలు దీపాలతో గణపతి రూపాన్ని తీర్చిదిద్ది తమ భక్తుని చాటుకున్నారు. తొమ్మిది రోజులపాటు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు ప్రతి ఇంటి నుంచి వెలిగించి తీసుకువచ్చిన దీపాలతో గణపతి రూపాన్నిఅలంకరించారు. నూనె దీపాలతో రూపుదిద్దుకున్న గణపతి ఆకృతి పలువురిని విశేషంగా ఆకట్టుకుంది.