03-09-2025 11:35:25 AM
గుమ్మడిదల, (విజయక్రాంతి): భక్తులకు ఎల్లవేళలా తోడు ఉంటూ ఎంతో ప్రసిద్ధి గాంచిన భద్రకాళి శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో(Bhadrakali Sri Veerabhadra Swamy ) మంగళవారం కార్యనిర్వహణాధికారి శశిధర్ గుప్త ఆధ్వర్యంలో హుండీ ఆదాయం లెక్కింపు జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ... 51 రోజు ఆదాయము రూ.16,50,038 అన్నదానం హుండీ ఆదాయము 75,599 వచ్చిందని దేవాలయ కార్య నిర్వహణ అధికారి శశిధర్ గుప్తా తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇన్స్పెక్టర్ రంగారావు, పాలకమండలి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ధర్మకర్తలు శ్రీనివాస్ గౌడ్, అశోక్ గౌడ్,పూజారి కృష్ణ పొన్నబోయిన రాజు, బాజా భాస్కర్ గౌడ్, వీరస్వామి యాదవ్, బజరంగ్ సింగ్, యాదగిరి గౌడ్,ఆశ,గ్రామ పెద్దలు భాస్కర్ రెడ్డి,నాగేందర్ గౌడ్, లక్ష్మీనారాయణ,భక్తులు పాల్గొన్నారు.