calender_icon.png 2 September, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పు చేస్తే కుటుంబ సభ్యులైనా సహించమని కేసీఆర్ గతంలోనే చెప్పారు

02-09-2025 04:20:39 PM

హైదరాబాద్: గత కొద్దిరోజులుగా బీఆర్ఎస్ పార్టీలోని నాయకులను, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తూ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసే పనుల వలన పార్టీకి నష్టం జరుగుతుందని గుర్తించి, పార్టీకి నష్టం కలిగించే వ్యక్తి ఎవరినైనా ఉపేక్షించేది లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS chief KCR) తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్(BRS whip KP Vivekanand) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యం అని పేర్కొన్నారు. 

తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించమని కేసీఆర్ గతంలోనే చెప్పారని.. కన్నకూతురు కంటే కూడా కష్టంలో పార్టీకి అండగా ఉన్న కార్యకర్తల భవిష్యత్తు ముఖ్యమని తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయమని అన్నారు. పార్టీ కంటే ఎవరు పెద్ద వారు కాదనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైందని.. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారు, ఈరోజు పార్టీ కోసం కన్న బిడ్డను కూడా వదులుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని వివేకానంద్ పేర్కొన్నారు.