23 June, 2026 | 2:31 AM

బీటీ రోడ్డు పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

23-06-2026 01:10 AM

గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ 

సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 

మిర్యాలగూడ, జూన్ 22: గంగమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గంగ దేవమ్మను వేడుకున్నారు. సోమవారం మండల పరిధిలోని ఉట్లపల్లి గ్రామంలో గంగా దేవమ్మ గుడి ప్రారంభోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గంగా దేవమ్మ గుడి దగ్గర నుండి ఉట్లపల్లి గ్రామానికి మూడు కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.

గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలు మెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాథమిక ఇస్తుందని తెలిపారు. గ్రామాలలోని ప్రజల సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు యాదవ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.