calender_icon.png 27 September, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడక్ షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ విడుదల చేసిన నాయిని

27-09-2025 02:28:20 PM

హనుమకొండ,(విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో కడక్ షార్ట్ ఫిల్మ్( Kadak short film) వెబ్ సీరిస్ ను, పోస్టర్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈరోజు సందర్బంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ  శ్రమను నమ్ముకుని పనిచేస్తే వారిని విజయం వరించడం ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు కడక్ షార్ట్  ఫిల్మ్ లో చూపించారని అన్నారు.  తను చేసే వృత్తి పట్ల ప్రతీ ఒక్కరికీ గౌరవం ఉండాలనే అంశం పైన కడక్  షార్ట్ ఫిల్మ్ వెబ్ సీరిస్ ను రూపొందించామని ఆ చిత్ర నిర్మాత, దర్శకులు ఐదులాపురం సనత్ కుమార్ తెలిపారు.

 హనుమకొండ  నగరంలో తనదైన గెటప్ లో  చాయ్ అమ్ముకుని జీవనం సాగించే ఒక వ్యక్తి యొక్క బయో ను ఈరోజు షార్ట్ ఫిల్మ్ వెబ్ సీరిస్ లో చూపించామని , అందరూ తాము చేస్తున్న పని లో  నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ విజయం పొందాలని కోరుతూ ఈ  వెబ్ సీరిస్ లో మొదటి బాగాన్ని ఈరోజు విడుదల చేసామని దర్శకులు సనత్ కుమార్ తెలిపారు.  సనత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ద్వారా ఎంతో మంది సీనియర్ , నూతన కళాకారులకు అవకాశం కల్పిస్తున్నామని సనత్ కుమార్ చెప్పారు. ఈ  కార్యక్రమం లో కార్పొరేటర్ తోట వెంకన్న్, ఈ చిత్రం ఎడిటర్ కందగట్ల వికాస్,  నటీనటులు జంగా.రఘువీర్ యాదవ్,  నాగబెల్లి అరుణ్ కుమార్,  లావణ్య, చంద్రశేఖర్, కే.పీ రావల్  తదితరులు పాల్గొన్నారు.