24-01-2026 12:00:00 AM
మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
పెంచికల్‌పేట్, జనవరి 23 (విజయక్రాంతి): మండలంలోని గోంట్లపేట్ గ్రామం లో గిరిజన ఆరాధ్య దేవతలు సమ్మక్కసారలమ్మలకు సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు నిలువెత్తు బం గారం తులాభారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన దేవతల కృపతో ప్రజలం దరికీ శాంతి, సుఖసమృద్ధి కలగాలని ఆకాం క్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు భక్తు రాంచందర్, అన్నం రుక్మబాయి గణపతి, చప్పిడి రవి, బొట్టుపల్లి హరీష్, కృష్ణవేణి, నాయకులు ఘనపురం నాగేష్, చిలువేరు భాస్కర్, జునగరి మధుకర్, ప్రభాకర్, రాజన్న, వెంకన్న, బండి ప్రభాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.