calender_icon.png 28 January, 2026 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డుల్లో మౌలిక సదుపాయాలకు కృషి

28-01-2026 12:49:26 AM

మున్సిపల్ ప్రచారంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు లో రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్, మంచి నీటి మౌలిక వసతుల కల్పన కోసం తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయ ల్ శంకర్ అన్నారు. మంగళవారం వార్డు నెం బర్ 5 పరిధిలోని శ్రీరాం కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాలనీ కి వచ్చిన ఎమ్మెల్యే కు కాలనీవాసులు ఘన స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిస్తే మంచి పనులు చేస్తామని చెప్పాలిగాని, ప్రజలను ఇబ్బందుల గురిచేయొద్దని సూచించా రు. కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు జ్యో తి, రత్నాకర్ రెడ్డి, రాజు, దయాకర్, భూమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.