07-10-2025 01:01:23 AM
మణుగూరు, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : మండల పరిధిలోని తోగ్గూడెం గ్రా మంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీనివాస పెట్రోల్ బంకును పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బంక్ యాజమాన్యాని కి శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన పెట్రో ల్, డీజిల్ను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో బంక్‌యజమాని మార్తి శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్, పోషం సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పిండిగా వెంకట్, బంక్ సిబ్బంది పాల్గొన్నారు. .