07-10-2025 01:01:06 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, అక్టోబరు 6 (విజయ క్రాంతి): అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం రేకుర్తి లోని లక్ష్మి నరసింహ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారుడు మహమ్మద్ అబ్దుల్లా ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని, రానివారు ఎవరు ఆందోళన చెందవద్దని రెండో విడతలో అవకాశం వస్తుందని పేర్కొన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు.
భూమి లేని నిరుపేదలకు గాంధీనగర్ లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసి కొంతమందికైనా ఇచ్చి ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆస్తాపురం రమేష్, ఎండి చాంద్, ఊరడి లత, అస్తపురం తిరుమల, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, పర్వతం మల్లేశం, ఆవూరి లత, వారాల నర్సింగం, లక్కెపెల్లి మల్లేశం, మ్యాక శ్రీనివాస్, దుబ్బుల రాజయ్య, తదితరులుపాల్గొన్నారు.