08-09-2025 01:20:53 PM
కమలాపూర్ (విజయక్రాంతి): అఖిల భారత యాదవ మహాసభ కమలాపూర్ మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక సోమవారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మార్కెట్లో జరిగినట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బంక సంపత్ యాదవ్(District Chief Secretary Banka Sampath Yadav) తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, యాదవులకు రాష్ట్రస్థాయిలో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరియు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో యాదవ భవన్ ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, గొర్ల కాపరులకు ప్రమాద బీమా వర్తింపచేయాలని, దామాషా పద్ధతిలో యాదవులకు రావలసిన పదవులు రావాలని, యాదవ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల నూతన అఖిల భారత యాదవ మహాసభ కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా సల్పాల శ్రీనివాస్ యాదవ్ ప్రధాన కార్యదర్శిగా, శపాక చంద్రమౌళి యాదవ్, గౌరవ అధ్యక్షులు మేకల రవి యాదవ్, ఉపాధ్యక్షులుగా పాక రవీందర్ యాదవ్, ఓదెల యాదవ్, భాష బోయిన రమేష్ యాదవ్, గడల కొమురయ్య యాదవ్, అట్ల చంద్రమౌళి యాదవ్, కార్యదర్శులుగా దుండ్ర గోపాల్, దద్దు కుమారస్వామి, వంగ రాజకుమార్, కసరబోయిన రాజయ్య, ఎల్లబోయిన రవీందర్ ప్రచార కార్యదర్శిగా ఎర్రగోల్ల రవి యాదవ్, మండల యూత్ కమిటీ అధ్యక్షులు బోయిని శ్రవణ్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా ఎర్రగోళ్ల రజనీకాంత్ యాదవ్, ఉపాధ్యక్షులుగా కొడాలి అరుణ్ యాదవ్, దొంగల సుమన్ యాదవ్,వంగ రాజకుమార్ యాదవ్, ప్రచార కార్యదర్శిగా వంగ రమేష్ యాదవ్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి పాక శ్రీనివాస్ యాదవ్ ప్రసంగించారు.