25-10-2025 07:59:51 PM
ఏడుపాయల వరద నష్టానికి రూ.1.50 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కొండ సురేఖకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే..
పాపన్నపేట (విజయక్రాంతి): 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రూ. లక్ష ఆర్థిక సహాయం అందించారు. మండల పరిధిలోని లక్ష్మీ నగర్ లో శనివారం జరిగిన రాధా కిషన్ దశదినకర్మ కార్యక్రమానికి విచ్చేసి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. రామతీర్థం గ్రామానికి చెందిన కన్నె బోయిన గంగారం 6 నెలల క్రితం రాంపూర్ సమీపంలోని హనుమాన్ బండల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు భార్య నాగమణి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు సంతానం కాగా వారి కుటుంబానికి ఎమ్మెల్యే రోహిత్ ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్ రెడ్డి, గోవింద నాయక్, నరేందర్ గౌడ్, మల్లప్ప, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఏడుపాయల వరద నష్టానికి రూ.1.50 కోట్లు మంజూరు చేయండి
ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం మంజీరా వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, మరమ్మత్తులకు రూ. 1.50 కోట్లు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే రోహిత్ పేర్కొన్నారు. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమని, వనదుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తుంటారని, భక్తుల తాకిడికి తగ్గట్టుగా వెంటనే మరమ్మత్తులు చేసి భక్తుల ఇబ్బందులు తీర్చాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.