11 May, 2026 | 2:50 AM

కల్లూరులో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

11-05-2026 01:54 AM

కల్లూరు, మే 10 (విజయ క్రాంతి):  సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదివారం కల్లూరు మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని చెన్నూరులో కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ  చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఏసీ కోళ్ల ఫారాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం తాళ్లూరు వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు అభినందనలు తెలియజేశారు.అదే గ్రామంలో జరిగిన ఓనిల అలంకరణ వేడుకలు,వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తర్వాత గ్రామ దేవాలయంలో జాతర సందర్భంగా భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.  కల్లూరు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్,వైస్ చైర్మన్ కోటేశ్వరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుమర్తి చందర్రావు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.